వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రంగమ్మత్త..

SMTV Desk 2018-06-18 17:17:44  anasuya, movie offers, anchor anasuya.

హైదరాబాద్, జూన్ 18 : బుల్లితెర యాంకర్ గా రాణిస్తునే వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవల "రంగస్థలం" చిత్రం చిత్రంలో రంగమ్మత్తగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమ౦త జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా అనసూయకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా దాదాపు పది ఆఫర్లు వచ్చాయట. కానీ అనసూయ తన పాత్రకు సినిమాలో కాస్త ప్రాధాన్యత ఉంటే తప్ప ఓకే చేయడం లేదని టాలీవుడ్ టాక్. ఇప్పటికైతే ఈ అమ్మడు మూడు సినిమాలకు సైన్ చేసిందట. ఇక మరికొన్ని ఆఫర్స్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఎంతలా పెరిగిందో. భవిష్యత్తులో ఈ భామ మరిన్ని సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడపనుందన్నమాట.