అమెరికాలో చదువు ఎంతో ఖరీదు!

SMTV Desk 2017-07-13 12:19:15  

వాషింగ్టన్, జూలై 13 : జాతీయ భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసే ఓ ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం ఆమోదిస్తే భారతీయులతోపాటు విదేశీ విద్యార్థులకు కూడా కష్టాలు తప్పవు. అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరిన భారత విద్యార్థులు ఆ దేశంలో ఉండేందుకు అనుమతి కోసం ఏటా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన అంతర్గత భద్రత విభాగం పరిశీలనలో ఉండగా అమలయ్యేందుకు మరో 18 నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు మార్పు చేసుకునే సందర్భంలోనూ, అక్కడ నివాసం ఉండేందుకు పునఃదరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండే అంశాన్నీ అంతర్గత భద్రత విభాగం పరిశీలనలో వున్నాయి. నిర్దిష్ట కాలవ్యవధిలోగా కోర్సును పూర్తిచేసుకోకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు అమెరికాలో విద్యాభ్యాసాన్ని ఖరీదుగా, క్లిష్టతరంగా మార్చనున్నాయి.