బిగ్‌బాస్ నుండి సంజనా ఔట్..

SMTV Desk 2018-06-18 11:48:03  #bigboss season -2, sanjana elimination, nani bigboss, babu gogineni

హైదరాబాద్‌, జూన్ 18:బిగ్‌బాస్ సీజన్ 2లో మొదటి ఎలిమినేషన్‌ జరిగింది. సామాన్యుల కోటాలో ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నే ఆదివారం ఎపిసోడ్‌లో వైదొలిగారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. హౌస్ లోని ఇతర సెలబ్రిటీలతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు వెల్లడించారు. వచ్చిన రోజు నుంచే సంజనా దురుసుగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు సంజనాను తొలి వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు. ఓటింగ్‌లో ప్రేక్షకుల నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో హౌస్ నుండి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ బాబు గోగినేని, తేజస్విల మీద విమర్శలు చేశారు. బాబు గోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని.. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలని, అందరిని సమానంగా చూస్తే బాగుంటుందని సూచించారు. ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో నందిని రాయ్‌ ప్రవేశించనుంది.