అనుష్క..! నువ్వు మాట్లాడింది "చెత్త" కాదా.?

SMTV Desk 2018-06-17 18:10:48  anushka sharma, virat kohli, arhan singh,

ముంబై, జూన్ 17 : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.. తాజాగా రోడ్డుపై చెత్తను పడేసిన వ్యక్తిని చెత్త డబ్బాను వాడండి.. అని సున్నితంగా మందలించిన విషయం తెలిసిందే. కానీ ఆ వ్యక్తి మాత్రం అనుష్క మాటలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. చేసిన తప్పును ఒప్పుకోకపోయే సరికి, అనుష్క కోపంతో రగిలిపోయారు. ఈ తతంగాన్నంతా అనుష్క భర్త విరాట్ కోహ్లి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఇలాంటి వాటిపై అవగాహనను కల్పించండి. @అనుష్క శర్మ" అని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై చెత్త వేసిన (బాటిల్ పడేసిన) వ్యక్తి అర్హన్ సింగ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా దీటైన సమాధానం చెప్పాడు. అనుష్క.. నా కారులో నుంచి పడిన చెత్త కంటే నీ నోటి నుంచి వచ్చిన చెత్తే ఎక్కువ. ఈ పోస్ట్ ద్వారా మీలా నేను ప్రచారం పొందాలని అనుకోవడం లేదు. పొరపాటున ఓ మిల్లీ మీటరు చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేశా. కారులో నుంచి వెళ్తూ చూస్తే, అద్భుతమైన అనుష్క కనిపించింది. కాని పిచ్చెక్కిన రోడ్ సైడ్ వ్యక్తిలా అరిచింది. నేను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నా. మర్యాదగా ఉండటం వల్ల నీ స్టార్ ఇమేజ్ తగ్గదు. సభ్యత, సంస్కారం చాలా విధాలుగా ఉంటుంది. అందులో మాట తీరు ఒకటి. మీరు ఈ పనిని ఏ ప్రయోజనం కోసం చేసినా.. ఇప్పుడు ఇది మరింత తీవ్రమైన చెత్తగా మారింది" అంటూ ఘాటుగా స్పందించాడు.