కలియుగ ధర్మరాజు

SMTV Desk 2017-07-13 12:05:25  cards,wife,bet,indore,

మధ్య ప్రదేశ్, జూలై 13 : ధర్మరాజు కౌరవులతో జూదం లో ఓడిపోయినప్పుడు ద్రౌపది ని పణంగా పెట్టాడు. ఇప్పుడు అలాంటి సంఘటనే మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జూదానికి బానిసైన ఓ వ్యక్తి తను ఓడిపోతే తన భార్యను ఇస్తానని పందెం కట్టాడు. ఆ జూదం ఆటలో ఓడిపోయాడు. అందుకు బదులుగా గెలిచినా ఇద్దరి వ్యక్తులకు తన భార్యను అప్పగించాడు. ఆ ఇద్దరి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె మంగళవారం రోజు పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి కేసు నమోదు కాలేదు అని ఇండోర్ మహిళా పోలిస్ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ జ్యోతి శర్మ వెల్లడించారు. అందుకు స్పందించిన పోలీసులు ఆమె బర్త తో పాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరి వ్యక్తులకు పిలిపించి విచారించారు. అయితే భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా మహిళను వేధించినట్లు పోలీసులు విచారణలో తేలింది.