నాని భార్యకు శ్రీరెడ్డి చెప్పిన సమాధానం..

SMTV Desk 2018-06-17 13:01:21  sreereddy, nani wife anjana, hero nani, sreereddy facebook.

హైదరాబాద్, జూన్ 17 : తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. పలువురు వ్యక్తులను ఉద్దేశించి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల నానిని టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు చేయడంతో నాని శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై నాని భార్య అంజనా కూడా ఫైర్‌ అయ్యారు. అయితే తాజాగా అంజనా చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా శ్రీరెడ్డి మరో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ లో "హాయ్‌ మిసెస్‌. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్‌ చేయను. అవసరమైతే అలాంటి వాడ్ని వదిలేసి వెళ్లిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొత్తం విషయం తెలిసేవరకు సైలెన్స్‌గా ఉండండి. నా వైపు సత్యం ఉంది. కర్మ ఉంది. నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే" అంటూ పోస్ట్‌ చేసింది. మరి ఈ వ్యాఖ్యలపై నాని ఎలా స్పందిస్తాడో చూడాలి.