అందరికి ధన్యవాదాలు చెబుతున్నా..

SMTV Desk 2018-06-16 17:58:59  RAJINIKANTH, KARTHIK SUBBARAAJU, DARJILING SHOOTING.

హైదరాబాద్, జూన్ 16 : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రొఫెసర్ అవతారమెత్తనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక కళాశాలలో ఇందుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డార్జిలింగ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా రజనీ డార్జిలింగ్‌లో మీడియాతో మాట్లాడారు. డార్జిలింగ్ లోనే 30రోజులు షూటింగ్‌ జరుగుతుందని, ఇక్కడున్న అందమైన లొకేషన్లు చూసి చాలా సర్‌ప్రైజ్‌ అయ్యానన్నారు. ఇంత వరకూ ఎవరూ చూపించని చక్కటి ప్రదేశాల్లో షూట్‌ జరుగుతోంది. ఈ సినిమాలో ఆ ప్రకృతి అందాల్ని ప్రేక్షకులు చూడబోతున్నార౦టూ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా "కాలా" సినిమా విజయం గురించి ప్రస్తావిస్తూ.. "దేవుడి దయ వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా చక్కగా ఆడుతోంది. అందరికి ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమా కర్ణాటక రాష్ట్రంలో ఆ ప్రభుత్వ సాయంతో సజావుగా విడుదలైంది. అక్కడ కూడా విజయం సాధించింది" అని వెల్లడించారు.