సెక్స్ రాకెట్ పై స్పందించిన అనసూయ, లాస్య..

SMTV Desk 2018-06-16 17:24:07  CHIKAGO SEX ROCKET, ANASUYA, LASYA, COMMENTS.

హైదరాబాద్, జూన్ 16 : అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలై టాలీవుడ్ పై మరో పిడుగు పడింది. అమెరికాలో టాలీవుడ్ నటీనటులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ సంచలనం వెలుగుచూడడంతోపాటు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే విషయం బయటపడింది. అయితే ఈ సెక్స్ రాకెట్ గురించి యాంక‌ర్ అన‌సూయ. లాస్య స్పందించారు. ఈ మేరకు అనసూయ స్ప౦దిస్తూ.. "నేను చాలా రోజులుగా అమెరికా వెళ్ల‌లేదు. 2014లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌తో క‌లిసి ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాను. ఆ త‌ర్వాత 2016లో ఓ వ్య‌క్తి నాకు ఫోన్ చేసి అమెరికాలో తెలుగు అసోషియేష‌న్ నిర్వ‌హించే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని అడిగాడు. అత‌ను మాట్లాడే విధానం నాకు న‌చ్చ‌లేదు. దాంతో ఆ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించాను. నేను ఒప్పుకోక‌పోయినా నా ఫోటోను పోస్టర్‌లో వేసి ప్ర‌చారం చేసుకున్నారు" అని చెప్పింది. అలాగే లాస్య స్పందిస్తూ.. "నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ పెద్దమనిషి నాకు ఫోన్ చేసి ఆ ఉద్దేశంతో అడిగాడు. చాలా ఉన్నతస్థాయి వ్యక్తి ఆయన. దానికి నేను కుదరదని చెప్పేశాను. నా వద్దకు పెద్ద పెద్ద యాంకర్సే వచ్చారు. నువ్వెంత అఫ్ట్రాల్ అని నాతో మాట్లాడారు. అలాంటి కమిట్మెంట్లకు లొంగను కనుకే అమెరికాలో ఉన్నా నన్ను ఈవెంట్లకు పిలవడం మానేశారు. ఓసారి పిలిస్తే తన కుటుంబసభ్యులతో వెళ్లినందుకు ఫీల్ అయ్యారు. అందుకే నేను రిఫర్ చేసిన వాళ్లను కూడా తీసుకోవడం లేదు" అని చెప్పుకొచ్చింది.