బంగ్లాదేశ్ క్రికెటర్ పై యాసిడ్ దాడి

SMTV Desk 2017-07-13 11:39:17  Bangladeshi, cricketer, Tamim, Iqbal, family, attacked, acid

ఢాకా, జూలై 13 : బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కుటుంబం పై యాసిడ్ దాడి జరిగింది. ఇంగ్లాండ్ లో జరుగుతున్న నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్ మ్యాచ్ ల కోసం తమీమ్ తన భార్య అయేషాను సంవత్సరం వయసున్న తన కుమారుడిని తీసుకొని ఇంగ్లాండ్ కు వచ్చారు. మంగళవారం రాత్రి తమీమ్ తన భార్య కుమారుడితో కలిసి ఒక రెస్టారెంటు కు డిన్నర్ కు వెళ్లారు. అక్కడ కొందరు దుండగులు తమీమ్ కుటుంబాన్ని వెంబడించి యాసిడ్ దాడి చేసారు. అదృష్టవశాత్తు ముగ్గురు తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో తమీమ్ మీడియా తో మాట్లాడకుండా బంగ్లాదేశ్ వెళ్ళిపోయినట్లు సమాచారం.