న్యూయార్క్ లో ‘విరుష్క’ జంట విరామం

SMTV Desk 2017-07-13 11:14:04  ANUSHKA, VIRAAT, NEWYORK, SOCIAL MEDIA, IFHAA, BOLLYWOOD,

న్యూయార్క్, జూలై 13 : ప్రేమ జంట విరాట్, అనుష్క శర్మ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటుంది. వాళ్ళిద్దరూ ప్రస్తుతం న్యూయార్క్‌లో సేదతీరుతున్నారు. తాజాగా విరాట్, అనుష్కతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. "చాలా రోజుల తర్వాత నా ప్రేయసితో కాస్త విరామం కావాలని" క్యాప్షన్‌ ఇవ్వగా ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ గా వ్యాపించింది. నెటిజన్లు ఆ ఫోటోకి చూడ చక్కటి జంట ‘విరుష్క’ అని ముద్దుపేరు పెట్టి తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో ఐఫా ఈవెంట్‌ జరగబోతోంది. ఇదిలా ఉండగా విరాట్‌ వెస్టిండీస్‌ టూర్‌ ముగించుకుని అక్కడి నుంచి యూఎస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో షారుక్‌కి జోడీగా ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రంలో నటిస్తోంది. విరాట్ ఈ నెల 26 నుంచి జరగనున్న శ్రీలంక సీరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు.