గాసిప్స్ నమ్మకండి : శ్రీదేవి

SMTV Desk 2017-07-13 10:30:45  mumbai. sreedevi kapoor, jaanvi kapoor, media, gossips, nose surgery.

ముంబై, జూలై 13 : శ్రీదేవి ఇంగ్లిష్ వింగ్లిష్ మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తరువాత మామ్ చిత్రంతో మనల్ని పలకరించబోతున్నారు. ఇంకా తన కూతురు జాన్వికపూర్ సినీ రంగ ప్రవేశం చేయకముందే రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా జాన్వి ముక్కుకు సర్జరీ చేయించుకుందన్న వార్త బాగా హల్‌చల్‌ చేస్తుంది. జాన్వి అందం మీద రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో తన కూతురు కెరీర్‌ ప్రమాదంలో పడకూడదని గ్రహించిన శ్రీదేవి మీడియా తో ఓ విన్నపం చేసుకుంది. తన కూతురు ఇంకా చిన్న పిల్లనే అని, ఇలాంటి పుకార్లు వింటే తను తట్టుకోలేదని ఇంకోసారి తన మీద ఇలాంటి వార్తలు రాయవద్దని అన్నారు. ఇకనైనా తన కూతురి గురించి వదిలేయమని ఇలాంటి గాసిప్స్ సృష్టించే వారికి విజ్ఞప్తి చేసింది.