వర్ధమాన సంగీత దర్శకుడి ఆత్మహత్య..

SMTV Desk 2018-06-15 15:43:34  anurag music director suicide, young nusic director anurag, tollywood, hyderabad

హైదరాబాద్‌, జూన్ 15 :వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్‌ ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల కిందట అనురాగ్‌ ఆత్మహత్యకు చేసుకున్నట్లు సమాచారం. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వస్తున్నాయి. వికారాబాద్‌‌ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాద్‌ నాగోల్‌ మమత నగర్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కొందరు అనురాగ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, కొందరి ప్రోద్బలంతో అతడు బలవన్మరణం చెందాడని తెలుస్తోంది. పలు షార్ట్‌ఫిల్మ్స్‌లకు అనురాగ్‌ పని చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడం అతడి కుటుంబంలో శోకసముద్రంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని కుటుంబసభ్యులు వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.