నాని తరువాత ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?

SMTV Desk 2018-06-15 13:09:36  nani new movie, jersey, jersey titil, first look.

హైదరాబాద్, జూన్ 15 : నేచురల్ స్టార్ నాని.. తన 23వ సినిమాకు సంబంధించిన వివరాలను పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి "జెర్సీ" అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో టీమిండియా జెర్సీ, దానిపై అర్జున్‌ 36 అని రాసుంది. బ్యాట్‌, గ్లౌజులు, హెల్మెట్‌ని బట్టి చూస్తే క్రికెట్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాది టీమిండియా క్రికెటర్‌ జీవితాధారంగా తీస్తున్నారా.? కేవలం క్రికెట్‌ నేపథ్యంలో మాత్రమే తీస్తున్న సినిమానా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు నాని.. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.