ఎర్రగడ్డలో మహిళా దారుణ హత్య..

SMTV Desk 2018-06-14 17:52:14  erragadda murder, women murder in erragadda, bruthal murder in erragadda, hyderabad

హైదరాబాద్, జూన్ 14: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ఓ మహిళను దుండుగులు దారుణంగా హత్య చేశారు. అత్యంత పాశవికంగా మహిళా రెండు కాళ్ళు నరికి దుండుగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఈ హత్య ఏ సమయంలో జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.