సినీ పరిశ్రమలోని 10 మంది వ్యక్తులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు

SMTV Desk 2017-07-12 17:54:53  cinema, allu aravind,

హైదరాబాద్, జూలై 12 : ఇటీవల నగరంలో అక్రమ డ్రగ్స్ కేసులో సినీ రంగానికి చెందిన 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులను ఇచ్చింది. వారంలోగా విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. సినీ పరిశ్రమలోని ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్ మాస్టర్ కు నోటీసులు ఇచ్చారు. మాదక ద్రవ్యాల కేసులో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేయగా, ఆ నిందితుల నుంచి 20 యూనిట్ల ఎల్ఎస్ సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ పై సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అరవింద్ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సినీ పరిశ్రమని డ్రగ్స్ మాఫియా అడ్డదారి పట్టించేందుకు ప్రయత్నం చేసుందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తెలంగాణ పోలీసులు ఈ మాఫీయా పై చేస్తున్న పోరాటాన్ని ప్రశంశిస్తూ, సినీ పరిశ్రమలో 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్న వారికి నేను చేసే డిమాండ్ ఒక్కటే అంటూ "డ్రగ్స్ తీసుకునేవారు మూడో కంటికి తెలియదు అనుకుంటారు. కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క అంశం ప్రభుత్వం దగ్గర ఉంది.. డ్రగ్స్ ఎప్పుడు?ఎక్కడ?ఎవరి వద్ద? ఎలా? తీసుకున్నారన్న ప్రతి రికార్డు కూడా వారి వద్ద ఉంది" అని అరవింద్ అన్నారు. కేవలం పోలీసులు మీ భవిష్యత్తు నాశనం చేయకూడదన్న ఉద్దేశంతోనే మీ 15 మందిని ఉపేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా డ్రగ్స్ తోవకు వెళ్ళకుండా సినీ పరిశ్రమకు మంచి పనులు చేయమని హితవు పలికారు.