రికార్డు బద్దలు కొట్టిన తొలి మహిళా క్రికెటర్

SMTV Desk 2017-07-12 17:36:35  The, first, woman, cricketer, Mithali, was, breaking, record

న్యూఢిల్లీ, జూలై 12 : భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ గా మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ చరిత్రకెక్కారు. ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్ లో 34 పరుగుల వ్యక్తీ గత స్కోర్ వద్ద ఆమె ఈ రికార్డు ను సాధించారు. ఇంతకూ ముందు ఇంగ్లాండ్ కు చెందిన ఎడ్వర్డ్స్ పేరు మీద ఉన్న ఈ రికార్డును మిథాలీ రాజ్ సొంతం చేసుకున్నారు. మిథాలీ రాజ్ ఇప్పటి వరకు 183 వన్డేల్లో 164 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగులు చేసి 49 అర్ధ సెంచరిలు చేసారు.