నాని.. విశాల్ మధ్యలో శ్రీరెడ్డి..

SMTV Desk 2018-06-13 15:12:40  hero nani, vishal, sreereddy, casting couch.

హైదరాబాద్, జూన్ 13 : తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. పలువురు వ్యక్తులను ఉద్దేశించి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల నానిని టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు చేయడంతో నాని శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నటుడు విశాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదం. అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అందరికి తెలుసు. నేను నా వ్యక్తిగత కారణాల వల్ల నానికి సపోర్ట్ చేయలేకపోతున్నా. నాని గురించి నాకు తెలుసు. నిజంగా శ్రీరెడ్డి వ్యాఖ్యల్లో నిజాయితీ ఉంటే ఆధారాలు చూపించాలి. అంతేకాని ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇతరులను ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం పేరున్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ వారిపై ఆరోపణలు చేయమని కాదు. మున్ముందు నన్ను కూడా టార్గెట్‌ చేస్తుందేమో" అంటూ చెప్పుకొచ్చారు.