బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముందుకు కదిలేనా..!

SMTV Desk 2018-06-12 20:15:20  bullet train, nda government, bullet train project, jica, japan

ముంబై, జూన్ 12 : ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌’ మరింత ఆలస్యం కానునట్లు తెలుస్తోంది. జపాన్‌ సహకారంతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గడువు విధించింది. కానీ ఇప్పుడు భూ సేకరణ అంత సులభంగా సాధ్యమయ్యేలా కనపడటంలేదని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ముంబై - అహ్మదాబాద్‌ మార్గంలో రూపొందనున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ కారిడార్లో ఐదోవంతు భాగం అనగా 108 కి.మీ. విస్తీర్ణం పాల్గార్‌ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ముఖ్యంగా మామిడి, సపోట వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి. దాంతో ఈ భూములను వదులుకోవడానికి పాల్గార్‌ రైతులు సుముఖంగా లేరు. వచ్చే ఏడాది పాల్గార్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న క్రమంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నాయి. ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని...ఈ ప్రాజెక్ట్‌ కోసం వెచ్చించే సొమ్మును మన రైల్వేలను అభివృద్ధి పర్చడం కోసం వినియోగిస్తే మంచిది’ అని వాదిస్తున్నాయి. ఈ విషయం గురించి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో - ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ) అధికారి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడు​కల నాటికి అనగా 2022, ఆగస్టు 15 నాటికి ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. మరి మోదీ ప్రభుత్వం ఎటువంటి ఈ విషయంపై ఎటువంటి చర్య తీసుకుంటుందో చూడాలి.