దిలీప్ రెండు రోజుల పొలీసు కస్టడీ:

SMTV Desk 2017-07-12 15:17:08  let,amaranath,yatris,attack

హైదరాబాద్ : జూలై 12 : లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో దిలీప్ కీలక నిందితుడని విచారించి. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మూడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు.ముఖ్యంగా కొచ్చి, త్రిశూర్‌లోని పలు చోట్ల దిలీప్‌ నటిపై అఘాయిత్యానికి పథక రచన చేశాడని, కాబట్టి ఆయా ప్రాంతాలకు ఆయనను తీసుకెళ్లి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఇంతటి అఘాయిత్యాన్ని దిలీప్‌ చేయించాడని భావిస్తున్న నేపథ్యంలో దిలీప్‌ను మరింతగా లోతుగా ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కుట్రలో ఇంకెవరి ప్రమేయమైనా ఉండే అనే కోణంలో పోలీసుల ఇంటరాగేషన్ సాగుతుంది. నటుడు దిలీప్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ఈ కేసులో దిలీప్‌ను కావాలని ఇరికించారని, అతను అమాయకుడినని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు.