సీఎం వద్దకు సమ్మె వ్యవహారం..

SMTV Desk 2018-06-10 16:38:35  ts cm kcr, ts rtc strike, pragathi bhavan, hyderabad

హైదరాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదంపై సందిగ్థత ఇంకా కొనసాగుతోంది. కాగా ఈ వ్యవహార మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు చేరింది. సమ్మె నివారణ కోసం కార్మిక సంఘాల నేతలతో మంత్రలు బృందం ఈరోజు మరోసారి సుదీర్ఘ చర్చలు జరిపింది. టీఎంయూ నేతలతో మంత్రుల బృందం ఈ మధ్యాహ్నం నుంచి చర్చలు చేపట్టింది. తమ డిమాండ్లను మంత్రులకు టీఎంయూ నేతలు నివేదించారు. ముందు సమ్మె విరమించండి.. ఆ తర్వాత అన్ని సమస్యలపై చర్చిద్దామని మంత్రులు టీఎంయూ నేతలతో అన్నారు. భేటీ అనంతరం చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించేందుకు మంత్రులు ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నష్టాల ఎదుర్కొంటున్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విభజనే పరిష్కారమనే ఆలోచనలో సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు తరహా పరిస్థితులపై అధ్యయనం చేసి, నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.