కరీంనగర్ లో మొక్కను నాటిన సీఎం కేసీఆర్

SMTV Desk 2017-07-12 14:10:49  kareemnagar, kcr, plant, erravalli, etela rajendhar

కరీంనగర్, జూలై 12 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ లో జరిగిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అల్గనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఎల్ఎండీ కట్ట దిగువన సీఎం మహోగని మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తదితరులు పాల్గొన్నారు. మొక్కను నాటిన అనంతరం సీఎం కరీంనగర్ కలెక్టరేట్ కు బయల్దేరి వెళ్లారు. మూడేండ్లుగా సాగుతోన్న ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటారు. ఆకుపచ్చని పండుగ మళ్లీ నేటి నుంచి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు.. ఆసక్తి ఉన్న వారికి కోరిన మొక్కను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.