కోరిక తీర్చలేదని..

SMTV Desk 2018-06-10 14:42:36  nellore, rape attempt, rape incidents, andhra pradesh

నెల్లూరు, జూన్ 10 : మహిళలుకు సమాజంలో రక్షణ కరువైంది. ఎన్ని చట్టాలు తెచ్చిన కొంతమందిలో మార్పు రావడంలేదు. ఏ వార్త చూసిన మహిళలపై దాడులు, అత్యాచారాలు అంటూ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ఓ షాప్ యజమాని వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెట్టాడు. ఆమెను లోబరుచుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు. ఆమె ఎంతకూ లొంగకపోవడంతో ఆగ్రహం చెందిన యజమాని ఆ మహిళకు జీవనాధారమైన షాపును జేసీబీతో తొలగించాడు. ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌ ఎదుటే జరిగినా వారు పట్టించుకోలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.