టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి

SMTV Desk 2017-07-12 12:53:45  ravi shastri, main Coach, rahul dravid, Batting, Coach, zahir khan, bowling coach

న్యూఢిల్లీ, జూలై 12 : అనిల్ కుంబ్లే రాజీనామాతో టీంఇండియా కోచ్ కోసం చాలా మందిని ఇంటర్వ్యూ చేసే ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. గంగూలీ, లక్ష్మణ్, సచిన్ లతో కూడుకున్న సలహా కమిటి చాలా మంది పేర్ల ను పరిశీలించి ఒక ప్రకటన చేసింది. అనిల్ కుంబ్లే స్థానంలో కోచ్ గా రవి శాస్త్రి ని ఎంపిక చేసి, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, విదేశీ బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ లను నియమించినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షులు సీకె ఖన్నా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 'భారత క్రికెట్ కోచ్ గా అపార అనుభవమున్న రవిశాస్త్రి ని మళ్లీ కోచ్ గా నియమించడం, అలాగే విదేశీ బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ లను ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.' అని బీసీసీఐ సీనియర్ అధికారి మీడియా తో అన్నారు.