ఒక్క మార్కు కోసం.. రివాల్యుయేషన్ వెళితే..

SMTV Desk 2018-06-09 15:12:59  revalution in karnataka, 10th marks revalution, karnataka, belgav, kaif mulla student

బెల్గావ్, జూన్ 9 : సాధారణంగా బాగా పరీక్షలు రాసి తప్పితే మరల మార్కుల వెరిఫికేషన్ చేసుకొనేందుకు రివాల్యుయేషన్ కు వెళతాం. మొత్తం మార్కులకు ఒక్క మార్కు తగ్గిందన్న కారణంతో ఓ యువకుడు రివాల్యుయేషన్ ను ఆశ్రయించగా అతడి నమ్మకమే గెలిచింది. కర్నాటకకు చెందిన మొహమ్మద్ కైఫ్ ముల్లాకు ఆ రాష్ట్ర 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో 100 శాతం మార్కులు వచ్చాయి. తొలుత 625 మార్కులకు గాను, అతనికి 624 మార్కులు వచ్చాయి. కాగా కైఫ్‌లో ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయిందో అని అసంతృప్తి ఉంది. దీంతో అతను రివాల్యువేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్‌గా రాశానన్న ఆత్మవిశ్వాసంతో అతను రివాల్యవేషన్‌కు ధరఖాస్తు చేసుకున్నాడు. అతను అనుకున్నదే నిజమైంది. బెల్లావ్‌లోని సెయింట్ గ్జావియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన కైఫ్.. రివాల్యుషన్‌లో ఆ ఒక్క మార్క్ కూడా కలిసివచ్చింది. సైన్స్ పేపర్ రివాల్యువేషన్ తర్వాత ఆ సబ్జెక్టులోనూ అతనికి నూటికి నూరు శాతం మార్కులు వచ్చేశాయి. దాంతో అతను రాష్ట్రంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతను ఆర్‌ఎల్‌ఎస్ కాలేజీలో చేరాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమన్నాడు. ఉన్నత విద్య పూర్తి అయిన తర్వాత చైల్డ్ లేబర్ లాంటి సమస్యలపై పని చేయాలనుకుంటున్నాడు. కైఫ్ తల్లితండ్రులు కర్నాటకలోనే టీచర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.