మిలీషియా దళ కమాండర్‌ లక్ష్మయ్య అరెస్ట్..

SMTV Desk 2018-06-07 13:28:59  milishiya maoist leader lakshmayya, east godavari, sp vishal, andhrapardesh

కాకినాడ, జూన్ 7 : తూర్పు మన్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మిలీషియా దళ కమాండర్‌ మావోయిస్టు ముచ్చిక లక్ష్యయ్యను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గురువారం పట్టుకున్నారు. శబరి దళంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మయ్య.. నాలుగు హత్య కేసులతో పాటు 20 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విశాల్‌ గున్నీ... మావోయిస్టు లక్ష్యయ్యను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చింతూరు మండలానికి చెందిన 24 ఏళ్ల లక్ష్యయ్య నాలుగేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు కొవ్వాసి దేవమ్మ అనే మావోయిస్టు దళ సభ్యురాలు తూ.గో జిల్లా పోలీసులకు లొంగిపోయింది. జిల్లా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌ సుకుమా జిల్లాలో ఈమె మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఎస్పీ విశాల్‌ గున్నీ వెల్లడించారు.