కర్ణాటకలో కొలువుదీరిన క్యాబినెట్..

SMTV Desk 2018-06-06 14:37:03  karnataka cabinet, congress-jds, kumaraswami, karnataka cabinet

బెంగళూరు, జూన్ 6 : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మంత్రివర్గం చర్చల పై ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు 21 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్ నుండి 14 మంది.. జేడీఎస్ నుండి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గ్లాస్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాబినెట్ లో బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేష్‌ను, కేజీపే పార్టీ అభ్యర్థికి కూడా స్థానం కల్పించారు. బీఎస్పీ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా రెండు విడతల్లో మంత్రివర్గాన్ని విస్తరించాలని మిత్రపక్షాలు కాంగ్రెస్‌, జనతాదళ్‌ తీర్మానించినట్లు సమాచారం. బుధవారం రెండు పార్టీలకు చెందిన 21 మంది మంత్రులుగా పదవులు చేపట్టారు. నిబంధనల ప్రకారం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 34కి మించరాదు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మంత్రి పదవులను 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. దీని ప్రకారం కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి సహా 12 మంత్రి పదవులకు కేటాయించారు. మొదటి దశ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్‌ నుంచి 14 మందికి, జేడీఎస్‌ నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారు.. డీకే శివకుమార్‌, ఆర్‌ వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్‌, శమనూరు శివశంకరప్ప, కేజే జార్జ్‌, కృష్ణ బైర్‌ గౌడ, రాజశేఖర్‌ పాటిల్‌, ప్రియాంక ఖర్గే, శివానంద్‌ పాటిల్‌, యూటీ ఖడార్‌, జమైర్‌ అహ్మద్‌ ఖాన్‌, పుట్టరంగ శెట్టి, శివశంకర రెడ్డి, జయమాల. జేడీఎస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారు.. హెచ్‌డీ రేవన్న, జీటీ దేవెగౌడ, బండప్ప కశంపుర్‌, సీఎస్‌ పుట్టరాజు, వెంకటరావ్‌ నాదగౌడ, హెచ్‌కే కుమారస్వామి, ఎస్‌ఏ ఆర్ఏ మహేశ్‌ లు ఉన్నారు.