ప్రాణాలు తీసిన మితి మీరిన వేగం!!

SMTV Desk 2017-07-11 18:50:27  road accident, banjara hills, hyderabad

హైదరాబాద్, జూలై 11 : పెరుగుతున్న జనాభా వల్ల రోడ్ల రద్దీ ఎక్కువవుతుంది. త్వరగా గమ్య స్థానం చేరాలన్న ఆత్రుతలో వాహానాలను అతి వేగంగా నడుపుతున్నారు. ముఖ్యంగా ఇటివలే 200 కి.మీ వేగంతో వచ్చిన నిశిత్ నారాయణ కారు డివైడర్ ని డీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మితి మీరిన వేగంతో దూసకు వచ్చిన కారు మరో ప్రాణం తీసింది. అసలు విషయం ఏంటంటే బంజారా హిల్స్ రోడ్ నెం. 3 వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టి డివైడర్ ను డీకొని అవతలి రోడ్డు పై పడిపోయింది. ఈ ప్రమాదం లో ఓ విద్యార్థి ప్రాణాలు కొలిపోగా, మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంలో ఫసహత్ అలీ అనే వ్యక్తి ప్రాణాలు కొలిపోగా జావేద్, వాహెద్ అనే మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ కారు సుమారు 100 స్పీడ్ తో వెళ్తున్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన తో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీని పైన అక్కడివారు స్పందిస్తూ, "అతి వేగం ప్రమాదకరం అని ఎన్ని సార్లు చెప్పిన వినిపించుకోవడం లేదు".