నాని ఛాన్స్ కొట్టేసిన మెగా సుప్రీం హీరో..!!

SMTV Desk 2018-06-05 16:46:25  natural star nani, director jishire tirumala, mega suprim hero sai dharam tej.

హైదరాబాద్, జూన్ 5 : నేచురల్ స్టార్ నాని అవకాశాన్ని మెగా హీరో కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు విషయం ఏంటంటే.. డైరెక్టర్ కిషోర్ తిరుమల.. తన వద్ద ఉన్న లవ్ స్టొరీ స్క్రిప్ట్ ను నానికి వినిపించారట. అయితే ఈ కథంతా విన్న నాని.. కథలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందంటూ సలహాలిచ్చాడట. కాని తన కథలో ఒక్క మార్పుకూడా చేయడం ఇష్టం లేని దర్శకుడు కిషోర్.. అదే కథను మెగా హీరోకి వినిపించాడట. ఇంతకీ ఎవరా మెగా హీరో అని ఆలోచిస్తున్నారా.? అదేనండీ మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా కథ నచ్చడంతో సాయిధరమ్ ఒకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు వచ్చే నెలలో ఈ సినిమాను తీసుకెళ్లడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాని ఛాన్స్ ను మెగా హీరో అందుకున్నాడంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.