నేను సావిత్రిలానే అయ్యేదాన్నేమో..!!

SMTV Desk 2018-06-05 13:19:34  samantha, about love story, abhimanyudu movie.

హైదరాబాద్, జూన్ 5 : అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతున్న కథానాయిక సమ౦త "అభిమన్యుడు" చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అక్కినేని వారసుడు నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈ భామ.. పెళ్లికి ముందు తమిళ హీరోతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రేమ విషయంలో తనది కూడా సావిత్రిలాంటి కథ కావాల్సిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. సావిత్రి కథ తెలుసుకున్నాక అది తన కథలాగే అనిపించిందట. తాను కూడా సావిత్రిలానే నమ్మానని.. కానీ అదృష్టం కొద్ది తప్పించుకున్నానంది. లేకపోతే తన కథ కూడా సావిత్రి లాగే అయ్యేదేమో అంటూ తెలిపింది. త్వరగానే ఆ బాధ నుంచి బయటపడ్డానని.. తాను చేసుకున్న పుణ్యం, అదృష్టం కొద్దీ తనకు చైతూ దొరికాడని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది సమ౦త. మరి సామ్ మాటలకు ఆ హీరో స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.