ప్రముఖ అంబానీ గృహానికి అగ్ని ప్రమాదం

SMTV Desk 2017-07-11 14:43:20   Mukesh Ambani, Fire accident, antilia

ముంబై, జూలై 11 : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థలకు అధిపతి అయిన ముకేశ్ అంబానీ నివసించే అంటిలియా గృహంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న 27 అంతస్తుల ఈ భవనంలో ఆరో ఫ్లోర్ లో ఏక దాటిగా మంటలు లేచాయి. ఈ సమాచారం అందిన వెంటనే 6 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ముకేశ్ అంబానీ విలాసవంతమైన భవనాన్ని ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంగా పేర్కొంది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ 12వేల 500 వందల కోట్లు. ఆరు అంతస్థుల ఈ భవనానికి పార్కింగ్, గ్యారేజీ కోసమే నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. కాగా గతంలో ఈ భవనానికి వాస్తు దోషాలున్నాయని పండితులు ముఖేశ్ అంబానీకి చెప్పడంతో ఆయన భవనంలో పలు మార్పులు, చేర్పులు చేయించి గృహ ప్రవేశం చేశారు. దీంతో ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం వాస్తు దోషమే ఉండవచ్చునని పండితులు ఈ మేరకు పేర్కొంటున్నారు.