మేకప్ తలచుకుంటే టెన్షన్ గా ఉంది..

SMTV Desk 2018-06-04 18:21:47  amitaab bacchan, prostatic makeup, bramhastra movie.

హైదరాబాద్, జూన్ 4 : బాలీవుడ్ మెగాస్టార్ ప్రస్తుతం "బ్రహ్మాస్త్రా" చిత్రంతో పాటు సుజాయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రంలోనూ నటించబోతున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాలను సెట్స్ పైకి తీసుకురానున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఆయన ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేసుకోవాలట. ఇలాంటి మేకప్‌తో టార్చర్‌ అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన బ్లాగులో.. "ఇప్పుడు నేను చేయబోయే ఈ రెండు సినిమాల్లో నేను ప్రోస్తెటిక్ మేకప్ తో నటించవలసి ఉంటుంది. ఈ తరహా మేకప్ నాకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. విగ్గుకు.. గెడ్డానికి గల జిగురు చాలా చిరాకు కలిగిస్తుంది. మున్ముందు ఈ సినిమాల చిత్రీకరణలో నేను నిర్విరామంగా పాల్గొనవలసి ఉంటుంది. ఈ ప్రోస్తెటిక్ మేకప్ పెట్టే టార్చర్ తలచుకుంటే ఇప్పటి నుంచే టెన్షన్ గా వుంటోంది" అంటూ ఆయన తన బ్లాగులో రాసుకొచ్చారు. బిగ్ బి ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.