నెటిజన్లకు సోనమ్ ధీటు జవాబు..

SMTV Desk 2018-06-04 13:12:30  sonam kapoor, anandh ahuja, marriage issue, social media.

ముంబై, జూన్ 4 : బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ఆమె వివాహమాడారు. అయితే మంగళసూత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. సోనమ్ మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని చేతికి కట్టుకొవడంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సంప్రదాయాన్ని సోనమ్ మంటగలుపుతున్నారని ఒకరు.. ఆమెకు పద్ధతి లేదంటూ మరొకరు ఇలా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ విమర్శలన్నింటికీ ధీటుగా సోనమ్ బదులిచ్చింది. "నా పోస్ట్‌కు కామెంట్లు చేసే విషయంలో.. వారి పట్ల విచారిస్తున్నా. ఎందుకంటే నేను ముఖ్యమైన వ్యక్తిని, నా నుంచి వారు లబ్ధి పొందాలని చూస్తున్నారు. నా ద్వారా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు" అని ఆమె అన్నారు. తనపై విమర్శలు చేసే వారికి అంతకు మించిన పనేం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సోనమ్ ముఖ్య పాత్రలో నటించిన "వీర్‌ ది వెడ్డింగ్‌" సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది.