ఒక్క రూ.1 అధికంగా తీసుకున్న... ఈ నెంబర్ కు ఫోన్ చేయండి

SMTV Desk 2018-06-04 12:40:24   Hyderabad multiplexes, mrp and other violations, hyderabad, akun sabarwal

హైదరాబాద్, జూన్ 4 : నగరంలో మాల్స్, మల్టీ ప్లెక్స్ లు, వినోదం కోసం వెళ్తున్న జనాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కాగా నిన్న హైదరాబాద్ లో గత రెండు రోజులుగా వివిధ మాల్స్ పై దాడులు జరిపి 100కు పైగా కేసులను నమోదు చేసిన లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు.. ఇకపై ఎంఆర్పీకి మించి ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేసుల వివరాలను వెల్లడించిన తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్, 15 బృందాలు వివిధ మాల్స్ లో తనిఖీలు చేశాయని తెలిపారు. ఇకపై మల్టీ ప్లెక్స్ లు, సినిమా థియేటర్లలో మోసం జరిగినట్టు గమనిస్తే, 7330774444 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అకున్‌ సభర్వాల్‌ కోరారు. తాము వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.