అనాథ శవానికి పోలీసు అధికారి అంత్యక్రియలు

SMTV Desk 2017-07-11 13:19:47  Police officer, The orphans corpse, Funeral,

తిరువనంతపురం, జూలై 11 : ఇటీవల ఓ పోలీస్ అధికారి అనాథ శవానికి అంత్యక్రియలు చేశారు. దీనిపై స్పందించిన వారు మానవత్వం చాటుకున్నరంటూ ఆయన పట్ల ప్రసంశల జల్లు కురిపించారు. విషయంలోకి వెళితే కేరళ పతనంతిట్ట జిల్లా పులికీజ్హు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దుకాణం వద్ద జూన్ 29న ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి మృతి చెందిన సమాచారాన్ని దుకాణ యజమాని పోలీసులకు చేరవేశాడు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసు ఆఫీసర్ పీఎన్ సుదర్శన్ మృతదేహం ఫోటోను మీడియాలో ప్రకటన చేయగా నాలుగు రోజులు పుర్తయినప్పటికీ ఎవరు ముందు రాకపోవడంతో సుదర్శనే విశాల హృదయుడై ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో స్థానిక అధికారులు అనుమతి మేరకు జూలై 4న సుదర్శన్ ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో హ్యాట్సాఫ్ సార్ అంటూ పోలిస్ అధికారి సుదర్శన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ అందరూ అభినందించారు.