సినీ మల్టీప్లెక్స్‌లపై మెరుపు దాడులు..

SMTV Desk 2018-06-03 17:48:48  multiplexes ride, vigilance officers, hyderabad, multiplexes

హైదరాబాద్, జూన్ 3 : నగరంలోని సినీ మల్టీప్లెక్స్‌లపై తూనికలు,కొలతలశాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తినుబండారాలు, శీతలపానీయాలతో పాటు ఇతరు ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. కూల్‌ డ్రింక్‌ రూ.250. శాండ్‌విచ్‌ రూ.300, వాటర్‌ బాటిల్‌ రూ.80 విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు. జీవీకే మాల్‌, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, పీవీఆర్‌ సెంట్రల్‌, ఇన్‌ఆర్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ కాంప్లెక్స్‌, మీరజ్‌ షాపింగ్‌ మాల్స్‌, లియెనియో కార్నివాల్‌, ఏషియన్‌ మాల్స్‌లలో తనిఖీలు జరిగాయి. కూకట్‌పల్లి ఏషియన్‌ జీవీఆర్‌, కొత్త పెట్ మీరాజ్ థియేటర్ పలు మాల్స్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.