ఘనంగా హరీష్ రావు పుట్టిన రోజు వేడుకలు..

SMTV Desk 2018-06-03 11:31:05  minister harish rao birth day, harish rao birth day celebration, telangana, 47 th birth day

హైదరాబాద్, జూన్ 3 : రాష్ట్ర భారీనీటిపారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజు నేడు. ఈ రోజు ఆయన 47వ వసంతోత్సవంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని హరీష్ రావు నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వేద మంత్రాలతో పండితులు హరీశ్‌రావును ఆశీర్వదించారు. అభిమానుల కోలాహలం మధ్య భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు నేతలు మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. అభిమానుల సమక్షంలో మంత్రి భారీ కేక్ కట్‌చేశారు.