ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబురం..

SMTV Desk 2018-06-02 11:08:16  telangana state hood day, telangana state hood day celebrations, kcr, trs party

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ రోజు 4వ రాష్ట్ర అవ‌త‌ర‌ణోత్స‌వ వేడుక‌లు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌ ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.