సీతను అపహరించింది రావణుడు కాదట..!

SMTV Desk 2018-06-01 16:50:49   Sita abducted by Ram, Gujarat Sanskrit Textbook, Raghuvansham, gujarat board mistake

అహ్మదాబాద్, జూన్ 1 ‌: పురాణాల్లో రామాయణంలో అందరికి బాగా పరిచయం పేరున్న పేరు.. రాముడు.. రావణుడు.. వీరి పేర్లు ఒకేలా ఉన్న గుణగణాల్లో చాలా తేడాలు ఉన్నాయి. మరి చిన్నపిల్లల్ని ఎవరిని అడిగిన సీతను ఎవరు అపహరించారు అంటే.. ఠక్కున రావణుడు అని చెప్పేస్తారు. కానీ, గుజరాత్‌లోని పన్నెండో తరగతి సంస్కృతం పుస్తకంలో మాత్రం సీతను అపహరించింది రాముడు అని తప్పుగా ముద్రితమైంది. దీంతో గుజరాత్‌ రాష్ట్ర పాఠ్యపుస్తకాల బోర్డు(జీఎస్‌బీఎస్‌టీ) చిక్కుల్లో పడింది. రావణుడికి బదులుగా రాముడు సీతను అపహరించినట్లు ప్రింట్‌ అవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. పుస్తకంలోని 106వ పేజీలో ప్రఖ్యాత కవి కాళిదాసు రచించిన ‘రఘువంశం’ గురించి ఆంగ్లం‌లో వివరిస్తున్నప్పుడు ఈ తప్పు దొరికింది. పుస్తకంలో తప్పు ప్రచురితమవ్వడాన్ని అంగీకరిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా తప్పును సరిదిద్దుతామని గుజరాత్‌ రాష్ట్ర పాఠ్యపుస్తకాల బోర్డు ఛైర్మన్‌ వెల్లడించారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి డా.మనీశ్‌ దోషి తీవ్రంగా మండిపడ్డారు. తప్పులు రావడం చాలా సాధారణమైపోయిందని, వీటిని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవట్లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పులు వస్తే విద్యార్థులు ఎంత తికమకపడతారో ఊహించుకోవాలన్నారు.