ఓటమిని సమర్ధించుకొన్న రాజనాథ్ సింగ్..

SMTV Desk 2018-05-31 18:59:22  raj nath singh, minister rajnath singh, bjp, bypoll elections

న్యూఢిల్లీ, మే 31 : దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ ఘోరపరాభవం చవిచూసింది. బీజేపీయేతర పార్టీలన్ని ఒకేతాటిపైకి రావడంతో కాషాయదళంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కాగా ఈ విషయంపై ఆ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. భారీ విజయాలు అందుకునే క్రమంలో ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందని..భవిష్యత్‌లో భారీ ముందడుగు వేయబోతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుత ఓటమి రాబోయే రోజుల్లో తమ పార్టీ సాధించే ఘనవిజయాలకు సంకేతంగా ఆయన సమర్థించుకున్నారు. ఉప ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో కేవలం ఒక అసెంబ్లీ స్థానం విజయంతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నెల 28 తేదీన నాలుగు లోక్‌ సభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.