బస్ షెల్టర్స్ ప్రారంభించిన కేటీఆర్..

SMTV Desk 2018-05-31 18:08:38  ktr inaugurate, ac bus shelters, hyderabad, telangana

హైదరాబాద్‌, మే 31 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో నిర్మాణాలు పూర్తయిన బస్‌ షెల్టర్‌ను ప్రారంభించారు. నగరంలో బీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ఏసీ బస్‌ షెల్టర్స్‌ ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో అత్యున్నత ఆధునిక బస్ షెల్టర్‌లు హైదరాబాద్ మహానగరానికి కొత్త సొబగులు అద్దనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 826 ప్రాంతాల్లో ఆధునిక బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులలో ఈ బస్‌షెల్టర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ బస్‌షెల్టర్ల నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ చేపడుతుంది. రాబోయే ఆరు నెలల కాలంలో మిగతావన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా త్వరలో 3800 ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామని.. ఇందులో భాగంగా 500 ఎలక్ట్రిక్ బస్‌లను ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చుదిద్దుతామని, వీటిని ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.