కర్ణాటక, మేఘాలయలో ఓడిన బీజేపీ

SMTV Desk 2018-05-31 14:02:35  bypoll results, #bypollverdict, karnataka, congress, meghalaya

బెంగళూరు, మే 31 : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక, మేఘాలయ లో అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ ఓటమి చవి చూసింది. కర్ణాటకలో ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి మునిరతన్ బీజేపీ అభ్యర్ధిపై మునిరాజు గౌడపై భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో కర్ణాటకలో హస్తం పార్టీకి మరో సీట్ అదనంగా దక్కింది. మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మియాని డి శిరా విజయం సాధించారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థిపై 3,100సీట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ముకుల్‌ సంగ్మా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలవడంతో అంపతి స్థానాన్ని ఖాళీ చేశారు. దీంతో ఈ స్థానం నుంచి సంగ్మా కుమార్తె మియాని శిరా పోటీ చేసి గెలుపొందారు. కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ నియోజకవర్గంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్లు సాధించి విజయం సాధించారు. >>బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు షాక్ తగిలింది. జోకిహట్‌ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అభ్యర్థి విజయం సాధించారు. జోకిహట్‌ నియోజకవర్గంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుగా నిలవగా ఇందులో ఆర్జేడీ బలాన్ని చాటుకుంది. >> ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌ వాదీ పార్టీ విజయం సాధించింది. >> ఝార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీ స్థానంతో పాటు.. గోమియాను కూడా నియోజకవర్గంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ దక్కించుకొంది.