ఉప ఎన్నికల ఫలితాలు.. హోరాహోరి..

SMTV Desk 2018-05-31 11:05:37  bypoll elections, rr nagar, loksabha by poll, bjp, rld

ఢిల్లీ, మే 31 : దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ స్థానాలు, 10 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, రౌండ్‌ రౌండ్‌కి ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, నూర్‌పూర్‌ నియోజవవర్గాలతో పాటు నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌, భండారా-గోండియా లోక్‌సభ స్థానాలకు ఈ నెల 28న ఉప ఎన్నికలు జరిగాయి. మేఘాలయలోని అంపతి, ఝార్ఖండ్‌లోని గోమియా, సిల్లి, పశ్చిమబెంగాల్‌లోని మహేస్థల, బిహార్‌లోని జోకిఖాట్‌, కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌, పంజాబ్‌లోని షాకోట్‌, కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. పాలక, ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. లెక్కింపు కేంద్రాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరినీ క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పోలీసులు అనుమానంగా ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకుంటున్నారు.