ఆర్‌సీబీ రికార్డును అధిగమించిన చెన్నై

SMTV Desk 2018-05-30 11:00:17  csk ipl winner, ipl-11 csk, csk ipl-11, ipl sixes record

ముంబై, మే 30 : ఐపీఎల్-11 సీజన్ విజేతగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. రెండేళ్ల నిషేధం తర్వాత లీగ్ లోకి అడుగుపెట్టిన యెల్లో ఆర్మీ ముచ్చటగా మూడో సారి కప్ ను ముద్దాడింది. ఈ విజయంతో ఎన్నో రికార్డులను తమ ఖాతాలో వేసుకున్న ధోనిసేన మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే.. ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టడం. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న ఆరంభమైన ఈ మెగా టోర్నీ మే 27తో ముగిసింది. టోర్నీ మొదటి నుండి అద్భుతంగా ఆడిన చెన్నై జట్టు ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఫైనల్లో చెన్నై 10 సిక్స్‌లు నమోదు చేసింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు మొత్తంగా నమోదు చేసిన సిక్స్‌ల సంఖ్య ఎంతో తెలుసా? 145. గతంలో ఏ జట్టు ఒక సీజన్‌లో ఇన్ని సిక్స్‌లు నమోదు చేయలేదు. 2016లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 142 సిక్స్‌లు నమోదు చేయడమే ఇప్పటివరకు‌ రికార్డు. బెంగుళూరు సారథి విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 38 సిక్స్‌లు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డును చెన్నై బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆ జట్టు 145 సిక్స్‌లు నమోదు చేసింది. వ్యక్తిగత సిక్స్‌ల రికార్డు విషయానికొస్తే... షేన్‌ వాట్సన్‌ (35) కోహ్లిచేరువగా వచ్చాడు.