అ రెండు రికార్డుల లేకుండా ముగిసిన ఐపీఎల్‌..

SMTV Desk 2018-05-29 19:03:23  ipl records, ipl-11, csk, super over record

హైదరాబాద్‌, మే 29 : సినిమా వచ్చిన తర్వాత కలెక్షన్స్ కోసం.. ఐపీఎల్ ముగిసిన తర్వాత రికార్డులు కోసం మాట్లాడుకోవడం సహజమే. ఈ ఏడాది ఐపీఎల్-11 ఎంతో రసవత్తరంగా సాగింది. ఎన్నోకొత్త రికార్డులు నమోదయ్యాయి. మరికొన్ని బద్దలయ్యాయి. కాగా రెండు దృశ్యాలు మాత్రం మనం చూడలేకపోయాం. అవేంటంటే.. హ్యాట్రిక్‌ వికెట్లు, సూపర్‌ ఓవర్‌. ఐపీఎల్‌-11లో ఈ రెండూ నమోదు కాకపోవడం గమనార్హం. ఐపీఎల్ లో కొన్ని రికార్డులు.. >> ఈ సీజన్‌లో మొత్తం బ్యాట్స్‌మెన్‌ చేసిన పరుగులు 19,901. అందులో బౌండరీల ద్వారా వచ్చినవే 11,840. >> వేగవంతమైన బంతి : గంటకు 152.30 కిలోమీటర్ల వేగంతో రాజస్థాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేశాడు. >> తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ రెండింట్లోనూ నలుగురు ఆటగాళ్లు బౌలర్‌కే క్యాచ్‌లు ఇవ్వడం గమనార్హం. ఇంతకు ముందు ఏ సీజన్‌లోనూ ఇలా జరగలేదు. >> మొత్తం బౌలర్లు తీసిన వికెట్లు 720 >> డాట్‌ బాల్స్‌ 4,754 >> ఫైనల్లో లక్ష్య ఛేదనలో శతకం బాదిన ఏకైక క్రీడాకారుడు షేన్‌ వాట్సన్‌(చెన్నై సూపర్‌కింగ్స్‌). గతంలో వృద్ధిమాన్‌ సాహా కూడా ఫైనల్లో శతకం బాదినప్పటికీ అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు పరాజయం పాలైంది. వాట్సన్‌కు ఐపీఎల్‌లో ఇది నాలుగో శతకం. ఇందులో రెండు శతకాలు ఈ సీజన్‌లోనే నమోదు చేయడం విశేషం. >> ఆండ్రూ రసెల్‌ బాదిన ఫోర్ల కన్నా సిక్సర్లే ఎక్కువ. 17 బౌండరీలు సాధించిన అతడు 31 సిక్సర్లు బాదేశాడు. >> అఫ్గానిస్థాన్‌‌ స్పిన్నర్‌ ముజీబ్‌ జెద్రాన్‌ 17 ఏళ్లకే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడు ముజీబే. అతి తక్కువ వయసులో ఐపీఎల్‌లో వికెట్‌ తీసింది కూడా జెద్రానే.