పాకిస్తాన్ లో ఎన్నికల సమరం షూరూ..

SMTV Desk 2018-05-27 14:26:50  pakistan elections, pak general elections, ecp, islamabad

ఇస్లామాబాద్‌, మే 27: పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికల సమరం జూలై 25న జరగనుంది. ఆ రోజున దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించుటకు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అనుమతి ఇచ్చారు. సాధారణ ఎన్నికలు నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమీషన్‌ రాసిన లేఖకు అధ్యక్షుడు స్పందిస్తూ జూలై 25న ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ దేశ నియమావళి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే దేశ అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ పదవీ గడువు మే 31తో ముగియనుడడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్భాదవ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది. ఆ దేశ నియమావళి 57(1) నిబంధన ప్రకారం అధ్యక్షుడు అక్కడి ఎన్నికల సంఘంతో చర్చలు జరిపి ఎన్నికలకు అనుమతి ఇస్తారు.