ఆది కొత్త సినిమా షురూ..

SMTV Desk 2018-05-27 13:28:40  hero adi, new movie launch, hanuman movie makers, sai kumar.

హైదరాబాద్, మే 27 : డైలాగ్ కింగ్.. సాయి కుమార్ తనయుడు ఆది కొత్త సినిమా షురూ అయింది. హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాసేపటి క్రితం ఫిలింన‌గ‌ర్ దైవ సన్నిధిలో అధికారికంగా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సినిమాలో ఆది.. రెండు షేడ్స్ లో కనిపించనున్నారట. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీగా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని.. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నాగశౌర్య, వంశీ పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.