"ఆపరేషన్ 2019" ట్రైలర్ అదిరిపోయిందిగా..

SMTV Desk 2018-05-25 12:27:32  operation 2019, sreekanth hero, political back drop movie.

హైదరాబాద్, మే 25 : తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్.. ప్రస్తుతం పలు సినిమాలలో ముఖ్య పాత్రలను పోషిస్తూ బిజీగా గడుపుతున్నారు. శ్రీకాంత్ హీరోగా.. పోసాని తెరకెక్కించిన "ఆపరేషన్ దుర్యోధన" సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. వినూత్నమైన పొలిటికల్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారు శ్రీకాంత్. ఎలాంటి పాత్రలోనైనా యిట్టె ఒదిగిపోయే ఆయన ప్రస్తుతం "ఆపరేషన్ 2019" సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒంటి నిండా గాయాలతో నగ్నంగా ఉన్న శ్రీకాంత్ ను రౌడీలు కొడుతుండగా ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది. "గాంధీ కడుపున గాంధీ పుట్టడు.. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు.. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే" అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.