జపాన్ లో మెగా డాటర్ హంగామా..

SMTV Desk 2018-05-24 19:01:04  niharika konidela, mega daughter, japan tour, mega family.

హైదరాబాద్, మే 24 : మెగా డాటర్ నిహారిక యాంకర్ గా బుల్లితెరపైకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఆ తర్వాత "ఒక మనసు"తో వెండి తెరపైకి వచ్చి౦ది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక చాలా కాలం తర్వాత లాంగ్ ట్రిప్ కు ప్లాన్ వేశారు. ప్రస్తుతం ఈమె జపాన్ లో విహారిస్తున్నారు. అందమైన ప్రదేశాలు కనిపిస్తే వెంటనే ఫొటోలకు స్టీల్ ఇస్తోంది. అయితే నిహా తన హాలిడే ట్రిప్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. గాగుల్స్ తో ఆమె ఇచ్చిన పోస్ కు అభిమాలు ఫిదా అయిపోయారు. ఫొటోలు అద్బుతంగా ఉన్నాయంటూ నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా.. నిహారిక "హ్యాపీ వెడ్డింగ్" అనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాతో నిహారిక ప్రేక్షకుల ముందుకు రానుంది.