జూన్ 1 న రానున్న "రాజుగాడు"..

SMTV Desk 2018-05-24 17:54:06  raj tarun, rajugadu movie, amiar dasturi.

హైదరాబాద్, మే 24 : యువ నటుడు రాజ్ తరుణ్.. సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న "రాజుగాడు" చిత్రంలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించిన చిత్రంలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. ఇటీవల హీరో రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు అభిమానుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే వ్యాధి బారిన పడిన పాత్ర పోషిస్తున్నాడు రాజ్ తరుణ్. మరి ఆ వ్యాధి నుండి బయటపడగాలిగాడా.. ఆ తరువాత ఎదుర్కొన్న పరిస్థితులేంటి అనే ఆసక్తికరమైన కథతో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ సంగీతం అందించిన ఈ సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నట్లు తెలుస్తోంది.