రెండు రోజులు మూతపడనున్న బ్యాంకులు..

SMTV Desk 2018-05-24 17:10:51  banks, protest all banks, 30, 31 all banks are in protest.

హైదరాబాద్, మే 24 : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులంతా సమ్మెకు దిగనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. ఈనెల 30, 31న సమ్మె చేయనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని యూఎఫ్‌బీయూ ప్రకటించింది. ముఖ్యంగా వేతనం 2శాతం పెంపునకు, ఇతర సేవా పరిస్థితుల్లో మెరుగుదలను డిమాండ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్‌ నుంచి వేతన సవరణ జరపాలని.. కోరుతున్నారు. తమ పోరాటానికి ఖాతాదారులు సహకరించాలని కోరారు.